కర్నాటక కాంగ్రెస్​ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు

కర్నాటక కాంగ్రెస్​ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు
  • తెలంగాణలో పంచేందుకేనని అనుమానాలు
  • బెంగళూరులో 25 ప్రాంతాల్లో అధికారుల సోదాలు
  • లీడర్​ ఇంట్లో 23 కార్టన్ల నిండా కట్టల కొద్దీ డబ్బు గుర్తింపు
  • ఇప్పటికే రూ.8 కోట్లు కొడంగల్‌‌కు పంపినట్లు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: కర్నాటకలోని ఓ కాంగ్రెస్​ నేత ఇంట్లో ఐటీ ఆఫీసర్లు కట్టల కొద్దీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి దీన్ని ఇంట్లో దాచినట్లు అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం రాత్రి బెంగళూరులోని ఇద్దరు కాంట్రాక్టర్లకు చెందిన ఇండ్లు, ఆఫీసులు సహా 25 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో బైరేసంద్ర ప్రాంతంలో ఆర్టీ నగర్​ఆత్మానంద కాలనీలోని ఒక అపార్ట్‌‌మెంట్‌‌లో 23 కార్టన్లలో దాచి ఉంచిన రూ.500 నోట్ల కట్టలను గుర్తించారు. 

సుమారు రూ.42 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. నగదు స్వాధీనం చేసుకున్న ఆ ఫ్లాట్ కాంగ్రెస్​పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్​అశ్వత్తమ్మ, ఆమె భర్త, కర్నాటక కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.అంబికాపతిదిగా గుర్తించారు. నోట్ల కట్టలున్న కార్టన్​డబ్బాలను ఫ్లాట్​లోని ఒక గదిలో పరుపు కింద దాచారని ఐటీ అధికారులు వెల్లడించారు. వాళ్లు మొత్తం రూ.50 కోట్ల నగదు సమకూర్చారని, దాంట్లో నుంచే కొడంగల్ నియోజకవర్గానికి రూ.8 కోట్లు హవాలా మార్గంలో తరలించారని ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తున్నది. వాళ్లు మొత్తం రూ.50 కోట్ల నగదు సమకూర్చారని,  రూ.8 కోట్లు ఇప్పటికే తెలంగాణకు తరలించినట్టుగా అనుమాని స్తున్నామని ఐటీ అధికారులు స్థానిక మీడి యాకు చెప్పారు.

డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌కు అత్యంత సన్నిహితుడు!

ఐటీ రైడ్స్‌‌‌‌లో నగదుతో పట్టుబడిన కాంట్రా క్టర్​ అంబికాపతి.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌‌‌‌‌కు అత్యంత సన్నిహితుడని తెలుస్తున్నది. బెంగళూరు నుంచి చెన్నై మీదుగా తెలంగాణకు ఈ మొత్తాన్ని తరలించే ప్రయత్నం చేశారని సమాచారం. పక్కా సమాచారంతోనే ఐటీ శాఖ అధికారు లు అంబికాపతితో పాటు ఆయన బంధువుల ఇండ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. కర్నాటక నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా భారీ ఎత్తున నగదు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. 


ALSO READ: ఎన్నేళ్లు జెండా మోసినా..మిగిలేది అవమానాలే.. ఓట్లు కావాలి కానీ..సీట్లు ఇవ్వరా..?

దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఓట్లను కొనేందుకు కర్నాటక నుంచి వందల కోట్లను కాంగ్రెస్ తరలిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. కర్నాటకలో 40% ప్రభుత్వం పోయి 50 %  కమిషన్​ ప్రభుత్వం వచ్చిందని, కమిషన్లు వసూలు చేసి తెలంగాణలో ఖర్చు చేసేందుకు తరలిస్తున్నారని మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.