ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పదం వాడుకలోకి రావాలి

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే పదం వాడుకలోకి రావాలి

ఆంగ్ల సినిమాలను హాలీవుడ్ అంటారు. చైనీస్ మూవీస్ ను చైనావుడ్ అంటారు..కానీ ఇండియన్ సినిమా ముచ్చటకొస్తే.. ఇక్కడ రకరకాల ‘వుడ్లు’ ఉన్నాయి. సౌత్ నుంచి నార్త్ భాషల వరకు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాకు కూడా ఓ పేరు పెట్టే టైమ్ వచ్చేసినట్టే. ఒకప్పుడు ఇండియన్ సినిమాలలో బాలీవుడ్ దే హవా. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ.. దక్షిణాది సినిమా పరిశ్రమను చిన్నచూపు కూడా చూస్తుండే వారు అక్కడి మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా  మారింది. బాహుబలి, కేజీఎఫ్,ఆర్.ఆర్.ఆర్ ,పుష్ప లాంటి రీజనల్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాలీవుడ్ ను షేక్ చేశాయి. జాతీయ స్థాయిలో ఈ సినిమాలు పెద్ద సక్సెస్ కావడంతో బాలీవుడ్ అనేది మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. వేరే దేశాలవాళ్లు ఈ పాన్ ఇండియా సినిమాలు చూసి.. ఇవి బాలీవుడ్ సినిమాలే అని నమ్ముతున్నారు.కానీ అసలు విషయం తెలుసుకున్నాక, బాలీవుడ్ అనేది ఇండియన్ ఇండస్ట్రీలో భాగమేనని గుర్తిస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ,మాలీవుడ్, సాండల్ వుడ్ లాగే బాలీవుడ్ అనేది ఒక భాగమేనని అందరూ అర్థం చేసుకుంటున్నారు. 

భారీ వసూళ్లే టార్గెట్ గా క్యూ.. 

మరోవైపు మన సౌత్ సినిమాలు మరిన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. భారీ వసూళ్లు టార్గెట్ గా పుష్ప 2, ఆర్సీ 15, లైగర్ సినిమాలు రాబోతున్నాయి. మహేష్,రాజమౌళి కాంబినేషన్ లోనూ ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. సౌత్ సినిమా నెక్స్ట్ లెవల్ లో దూసుకుపోతున్న ఈ టైమ్ లో బాలీవుడ్ అనే మాట చిన్నగా కనిపిస్తోంది అందరికీ..ప్రస్తుతం బాలీవుడ్ అనే మాట కు పెద్ద పీట వేయడం మానేసి ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా పిలుచుకునే టైమ్ వచ్చింది.ఎందుకంటే.. ట్రిపుల్ ఆర్ ఇండియాలో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే...ఇప్పుడు యూనివర్సల్ గా కూడా ఈ సినిమా కొత్త రికార్టులు సృష్టిస్తోంది. రీసెంట్ గా అమెరికాలో encoRRRe పేరుతో మళ్లీ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఫేమ‌స్ హా‌లీవుడ్ సూప‌ర్ హీరోల సినిమాలు చూస్తున్నప్పుడు ఉండే రెస్పాన్స్ ఈ థియేటర్లో ఇప్పుడు కనిపిస్తోంది. ‘డాక్టర్ స్ట్రేంజ్’ లాంటి సిరీస్ కు పనిచేసిన రైటర్ కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు.అయితే వాళ్లంతా ఈ మూవీ బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారు.కానీ ఆ తర్వాత వాళ్లకు వచ్చిన కామెంట్స్ చూసి.. తప్పు తెలుసుకొని సౌత్ సినిమా అంటున్నారు.ఇంత కన్ ఫ్యూజన్ ఉంది కాబట్టి ప్రేక్షకుల నుంచి ఓ వైపు, విమర్శకులు,ట్రేడ్ వర్గాల నుంచి మరోవైపు ఇండియన్ సినిమాగా పేరు మార్చాలనే మాట గట్టిగా వినిపిస్తోంది.

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ దీపక్ ఏమన్నారంటే..

‘‘నిజమే.. ఇండియన్ సినిమాకు ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’’ అని పేరు పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది.ఎందుకంటే హిందీ సినిమాల కన్నా మన సౌత్ సినిమాలు దుమ్ము లేపుతున్నాయి. ఓవర్సీస్ లో కూడా మన కలెక్షన్లు హిందీ సినిమాలను దాటుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన విక్రమ్,మేజర్ సినిమాలు అక్షయ్ కుమార్ ‘‘పృథ్వీరాజ్’’ కన్నా ఎక్కువ చేశాయి. నో డౌట్ మన సినిమాలే వాళ్ల కన్నా టాప్. ఇన్ని రోజులు సౌత్ హీరోలు,సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లు పట్టించుకునే వాళ్లు కాదు.కానీ ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ సినీ నిర్మాత వచ్చి తమ సినిమాను దక్షిణాదిలో ప్రజెంట్ చేయడానికి రాజమౌళి ని రిక్వెస్ట్ చేశారు.అలాగే ఇప్పుడు హిందీ హీరోలు తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తీస్తున్నారు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ అనౌన్స్ చేసిన ‘‘జవాన్’’ కూడా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.అమీర్ ఖాన్ ‘‘లాల్ సింగ్ చద్దా’’ది కూడా అదే బాపతి. సల్మాన్ ఖాన్ ,అక్షయ్ కుమార్ లు అదే ఫాలో అవున్నారు. వాళ్లు సౌత్ ఇండస్ట్రీ మీద ఆధారపడుతున్నారనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు.కాబట్టి అర్జెంట్ గా బాలీవుడ్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’’ అనే పదం వాడుకలోకి రావాలి’’ అని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ దీపక్ విశ్లేషించారు.  

బాలీవుడ్ బడా హీరోలు ఏమంటారో.. 

టాలీవుడ్ ,కోలీవుడ్,సాండల్ వుడ్ నుంచి ఇంత అద్భుతమైన కంటెంట్ ఇస్తున్నప్పటికీ నేషనల్ వైడ్ గా సౌత్ ఇండస్ట్రీకి ఇంకా రావాల్సినంత పేరు రావడం లేదన్నది వాస్తవం. సౌత్ క్రెడిట్ ను బాలీవుడ్ కు కట్టబెట్టే పరిస్థితి వచ్చింది. హాలీవుడ్ వాళ్లు ఇవన్నీ బాలీవుడ్ సినిమాలనే ఇంకా నమ్ముతున్నారు. అందుకే వీలైనంత తొందరగా మూవీ మేకర్స్ ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ’’గా నామకరణం చేయాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు ,విమర్శకులు. మరి దీనిపై బాలీవుడ్ బడా హీరోల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.