గిరిజన దర్బార్ లో సమస్యలు త్వరగా పరిష్కరించాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్ 

గిరిజన దర్బార్ లో సమస్యలు త్వరగా పరిష్కరించాలి : ఐటీడీఏ పీవో బి.రాహుల్ 

భద్రాచలం, వెలుగు : గిరిజన దర్బార్​లో గిరిజనులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ యూనిట్​ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం గిరిజన దర్బార్​లో ఆయన ఆదివాసీల నుంచి ఆర్జీలు స్వీకరించి యూనిట్ ఆఫీసర్లతో మాట్లాడారు. ప్రతి యూనిట్​ఆఫీసర్​ తమ పరిధిలోని సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర పనులను ఆన్​లైన్ చేసి ఉంచాలని చెప్పారు. అర్హులైన ప్రతి గిరిజనుడికి తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని తెలిపారు.