ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను సీఎండీల దృష్టికి తీసుకెళ్లాం : జేఏసీ కో చైర్మన్ అంజయ్య

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను సీఎండీల దృష్టికి తీసుకెళ్లాం : జేఏసీ కో చైర్మన్ అంజయ్య

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిగిన జాయింట్ సమావేశంలో ఉద్యోగుల 12 ప్రధాన డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లామని జేఏసీ కో-చైర్మన్ పి.అంజయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్​సీ కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరినట్లు వివరించారు. 

1999–2004 మధ్య నియమితులైన ఈపీఎఫ్​ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం,   రిటైరైన ఈపీఎఫ్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని కోరారు. జేఏసీ చేసిన డిమాండ్లపై సీఎండీలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.