డేటా స్కామ్ పై చర్యలు తీసుకోండి : గవర్నర్ కు జగన్, బీజేపీ ఫిర్యాదు

డేటా స్కామ్ పై చర్యలు తీసుకోండి : గవర్నర్ కు జగన్, బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్ : ఏపీ పౌరుల డేటా వివాదం తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనం దిశగా సాగుతోంది. ఏపీ పౌరులకు సంబంధించి రహస్యంగా ఉండాల్సిన వివరాలను… టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని… ఈ డేటా ఉపయోగించి తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తోందని ఆరోపిస్తోంది వైఎస్ఆర్ సీపీ. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తన అనుచర నాయకులతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. డేటా కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని జగన్ గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు.

గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

మరోవైపు.. ఏపీ బీజేపీ నేతలు కూడా గవర్నర్ ను కలిశఆరు. డేటా స్కామ్ పై దర్యాప్తు జరిపి యాక్షన్ తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.  5 కోట్ల ఆంధ్రుల డేటాను ఏపీ సర్కారు దొంగిలించిందని ఫిర్యాదుచేశారు. ఆంధ్రా ప్రజల సమాచార భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. డేటా స్కామ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎఁడీ అశోక్ ను ఏపీ సర్కారు కాపాడుతోందని చెప్పారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ నేతలు.