కిషన్ రెడ్డికి బాస్ మోదీనా? కేటీఆరా? : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

కిషన్ రెడ్డికి బాస్ మోదీనా? కేటీఆరా? : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
  • గుల్జార్ హౌస్ ఘటనపై గల్లీ లీడర్​గా మాట్లాడిండు: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాస్ ప్రధాని మోదీనా? లేక కేటీఆరా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనపై కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కాకుండా బాధ్యత లేని గల్లీ లీడర్ గా మాట్లాడిండని ఫైర్ అయ్యారు.

 సోమవారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ చెప్తేనే కిషన్ రెడ్డి అక్కడకు వెళ్లాడని తనతో ఓ మిత్రుడు చెప్పాడని.. మోదీ చెప్తే వస్తారు కానీ, కేటీఆర్ చెప్తే ఎలా వస్తారని తనకు అనుమానం కలిగిందన్నారు. కిషన్ రెడ్డి అక్కడకు వెళ్లి ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు చూస్తే అది నిజమేనని అనిపించిందన్నారు.