జగ్గారెడ్డికి, నాకు తోడికోడళ్ల పంచాయితీనే  : రేవంత్

జగ్గారెడ్డికి, నాకు తోడికోడళ్ల పంచాయితీనే  : రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డారు. ఇద్దరూ కలిసి సీఎల్పీలోకి వెళ్లారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘‘ జగ్గారెడ్డికి, నాకు మధ్య జరిగేది తోడికోడళ్ల పంచాయితీనే. పొద్దున తిట్టుకుంటం. మళ్లీ కలిసిపోతాం’’ అని రేవంత్ అన్నారు.

తమ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని రేవంత్, జగ్గారెడ్డి ఈసందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ రేవంత్ పాదయాత్రకు నా మద్దతుపై త్వరలో ప్రకటన చేస్తా. ఇంకా పదేళ్లు అయినా రేవంత్ దిగిన తర్వాతనే నేను పీసీసీ అవుతా. రేవంత్ ను దింపి పీసీసీ కావడం సాధ్యం కాదు’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.