
- సీఎం రేవంత్‌ను సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదు
హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై చర్చించేందుకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని సవాల్ చేసేంత స్థాయి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు లేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ కు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ వి. కాంగ్రెస్ కు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ని. నీ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా. దమ్ముంటే సంగారెడ్డికి రా. లేదంటే సిరిసిల్లలోనైనా సరే కూర్చుందాం..” అని ఆయన చాలెంజ్ చేశారు.
శనివారం గాంధీ భవన్ లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. శ్వేత పత్రాలు కాదు.. డైరెక్ట్‌గా కూర్చుందాం రావాలని సవాల్ విసిరారు.
తనతో వద్దనుకుంటే మంత్రులు తుమ్మల, పొంగులేటి లేదా ఉత్తమ్‌తో అయినా చర్చకు రావాలన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో చేయలేని రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల్లోనే చేశారన్నారు.