మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. బుధవారం ( జులై 8 ) మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.నీళ్లు ఇయ్యనోళ్ళను ఊరి తియ్యాలంటున్న హరీష్.. మరి కాళేశ్వరంకూలీనందుకు హరీష్ రావును ఎం చెయ్యాలి సమాధానం చెప్పాలని అన్నారు. హరీష్ రావు ఓవర్ యాక్షన్ మాటల వల్లే కాళేశ్వరం కూలిందని అన్నారు.
ఇంజనీర్ల మాట హరీష్ వినకపోవడం తో కాళేశ్వరం కూలిందని.. హరీష్ ఎం సదివి కాళవడ్డడో ఏందో మరి అంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. హరీష్ మాటలకు విలువ లేదని...హరీష్ వి దొంగ మాటలని అన్నారు.కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి హరీష్ కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు జగ్గారెడ్డి.
ALSO READ : దమ్ముంటే E20 పెట్రోల్ వల్ల పాడైన ఒక్క కారు పేరు చెప్పండి..
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రావు మాటలను నిలదీయాలని... ఎక్కడ హరీష్ తిరిగిన అడ్డుకొని కాళేశ్వరం పై నిలదీయాలని పిలుపునిచ్చారు జగ్గారెడ్డి.
