
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోతల రాయుళ్లు అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను తీసుకువచ్చి.. మీరెం టో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఐటీఐఆర్ కోసం వారిని తాను అడుగుతూనే ఉంటానని, ఈ విషయంలో తన పోరాటం ఆగదన్నారు.
పింక్ బుక్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇట్లనే ఢిల్లీలో ప్రధాని మోదీని రెచ్చగొట్టి, కవిత జైలుకుపోయారన్నారు. కవిత 4 నెలలు జైల్లో ఉంటే తమకే బాధ అనిపించిందని, మళ్లీ ఇలాంటి మాటలతో రేవంత్‌ను రెచ్చగొట్టడం ఎందుకన్నారు. వరంగల్‌కు రావడానికి రాహుల్ గాంధీ భయపడుతాడా.. తోడేళ్లకు భయపడే పార్టీ కాంగ్రెస్సా అని ఆయన ప్రశ్నించారు.