వరద కాలువలో కారు బోల్తా...జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఘటన

వరద కాలువలో కారు బోల్తా...జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఘటన
  •     బీజేపీ నాయకుడి మృతి

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల క్రాస్  రోడ్డు సమీపంలోని వరద కాలువలో కారు బోల్తా పడిన ఘటనలో పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నేత తిర్మని రమణారెడ్డి(53) చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 18 న సాయంత్రం తన కారులో ఇంటి నుంచి వెళ్లిన రమణారెడ్డి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు 19న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్  కేసు నమోదైంది. ఆదివారం ఉదయం మల్యాల వరద కాలువలో కారు లభించగా, కారును బయటకు తీసి డెడ్​బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నీలం రవి, పెగడపల్లి ఎస్సై కిరణ్  తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్  ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తన భర్త రూ.25 లక్షలు ఖర్చు చేశాడని, ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.