జగిత్యాల, వెలుగు : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం విషయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 స్థానాలు ఉండగా, చైర్‌పర్సన్ పీఠం కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 26. ఇందులో కాంగ్రెస్‌కు 23 స్థానాలు, కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సంజయ్ వర్గానికి చెందిన ముగ్గురు రెబల్స్ ఇండిపెండెంట్లుగా గెలుపొందారు.
వీరితో పాటు ఇద్దరు ఏంఐఏం అభ్యర్థులు, మరో ఇద్దరు బీజేపీ రెబల్స్ కూడా సంజయ్ క్యాంప్‌కు దగ్గరయ్యారని తెలుస్తున్నది. ఇలా లెక్క 30 దాటుతుండడంతో మేయర్ పీఠం పక్కా అని స్పష్టమవుతున్నది. రిజల్ట్ కు ముందు జీవన్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో గుర్తుపై గెలిచిన వారు హైకమాండ్సూచనలు పాటించాలని చెప్పగా, ఇండిపెండెంట్లు మాత్రం తన మాట వినాలని జీవన్ క్లారిటీ ఇచ్చారు.
కానీ జీవన్ రెడ్డి ప్రచారంలో చురుగ్గా లేకపోవడం, ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చిన విషయాలు ఇప్పటికే సంజయ్ హైకమాండ్దృష్టికి తీసుకెళ్లారు. ఇక చైర్ పర్సన్ రేసులో తోపారపు లావణ్య, మూలాస్తపు లావణ్య, సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లు వినిపిస్తున్నా.. సంజయ్ తన వర్గానికే దక్కేలా గెలిచిన వారిని హైదరాబాద్‌కి తరలించి క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు.
