జగిత్యాల టౌన్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది రెండో ర్యాండమైజేషన్ పూర్తయినట్లు జగిత్యాల కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జనరల్ అబ్జర్వర్ ఖర్తాడే కాళీచరణ్ సుదామారావు సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో ఈ ర్యాండమైజేషన్ చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, జిల్లా నోడల్ అధికారి రాము, కలెక్టరేట్ ఏవో హకీమ్, ఈడీఎం మమత, అధికారులు పాల్గొన్నారు.
