జగిత్యాల టౌన్, వెలుగు: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, పశువుల అక్రమ రవాణా, గోవధ నివారణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లోని రాయపట్నం, రాజారాంపల్లె, చిల్వకోడూర్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంతకుముందు జిల్లాలో విశేష సేవలందించి బదిలీపై వెళ్తున్న డీఎస్పీలు రఘుచందర్, శ్రీనివాస్ లను ఎస్పీ సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
