మలయాళ చిత్రాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న మమిత బైజు.. ఇతర భాషల ప్రేక్షకులను సైతం తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఆమెకు ఇక్కడ కూడా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ స్ట్రయిట్ తెలుగు మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’లో ఆమె నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘జై హనుమాన్’ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. హనుమంతుడి భక్తి, పురాణ నేపథ్యం, భారీ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో మమిత బైజు నటించనుందనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఎంత ప్రాధాన్యం ఉంటుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
