హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఉగ్ర కుట్ర జరిగిందంటూ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తోన్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పందించారు. ‘‘నిన్నటి నుంచి సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చంచల్ గూడ జైలులో ఉగ్ర కుట్ర అని వదంతులు వినిపిస్తున్నాయి. అలాంటి కుట్రలు జైలులో ఏం జరగలేదు.. అవన్నీ వదంతులు మాత్రమే. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వార్తలు ప్రసారం ముందు అధికారులను వెరిఫై చేసుకోవాలి.
పుకార్లు స్ప్రెడ్ చేయడం వల్ల జనాలు భయాందోళనకు లోనయ్యే అవకాశం ఉంటుంది. చంచల్ గూడ జైలులో లష్కరే తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడు. అతని భార్య తప్ప అతన్ని కలవడానికి ఎవరూ రారు. సర్వే లైన్స్‌లో వారి ములాఖాత్ జరుగుతుంది. వారానికి రెండు ములాఖాత్‌లు అందరితో పాటు కాకుండా వాళ్ళకు వేరే సమయం ఉంటుంది’’ అని డీఐజీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
►ALSO READ | MP గడ్డం వంశీకృష్ణ చొరవతో పత్తి రైతులకు భారీ ఊరట
దేశంలో ఉగ్రకుట్ర వ్యవహారంలో సంచలన విషయాలు వెలగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోనూ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేశాయి.పేలుళ్లకు చంచల్ గూడ జైలు నుంచే టెర్రరిస్టు స్కెచ్చేసినట్లు గుర్తించాయి. ములాఖత్ లో భాగంగా తనను కలవడానికి వచ్చిన వారితో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు సమాచారం. దీంతో నగరంలోని ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. లష్కరే తోయిబా చెందిన ఉగ్రవాది కుట్ర చేసినట్లుతెలుస్తోంది.
