MP గడ్డం వంశీకృష్ణ చొరవతో పత్తి రైతులకు భారీ ఊరట

MP గడ్డం వంశీకృష్ణ చొరవతో పత్తి రైతులకు భారీ ఊరట

మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చొరవతో పత్తి రైతులకు ఊరట లభించింది. సీసీఐ సంస్థ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో సమస్యను ఎంపీ వంశీ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. 

వెంటనే స్పందించిన ఎంపీ వంశీ.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సీసీఐ)తో మాట్లాడి ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని కోరారు. రైతులకు సంబంధించిన పత్తి పంట ఇంకా పూర్తి దశలోకి చేరుకోలేదని.. ఇంకా పత్తి తీసే దశ ఉందని సీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియను మరికొన్ని రోజులు కొనసాగించాలని ఆయన కోరారు.

ఎంపీ వంశీ లేఖకు స్పందించిన సీసీఐ సంస్థ  మరో 7 రోజులు పత్తి కొనుగోళ్లు చేసుకోడానికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని నియోజకవర్గ రైతులు సద్వినియోగం చేసుకోవాలనీ ఎంపీ వంశీ కోరారు. ఎంపీ వంశీ కృష్ణ చేసిన కృషికి హర్షం వ్యక్తం చేశారు స్థానిక రైతులు.