కులగణనపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

కులగణనపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: నేడు తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ కులగణనపై బీసీలకు సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జనగణనలో సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర కేబినెట్​లో నిర్ణయించారని, ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో బీసీ కులగణన అంశాన్ని పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతామని వెల్లడించారు. తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే బీసీల తరఫున తాము అడిగిన పది ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. ఆదివారం పరేడ్​గ్రౌండ్స్ నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.