ఉగ్రవాదం ఉక్కుపాదం : కశ్మీర్ లో జమాతే ఇస్లామీ ఆస్తులు సీజ్

ఉగ్రవాదం ఉక్కుపాదం : కశ్మీర్ లో జమాతే ఇస్లామీ ఆస్తులు సీజ్

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద సంస్థ జమాతే ఇస్లామీ సంస్థ మూలాలపై హోంశాఖ నజర్ పెట్టింది. ఈ టెర్రర్ గ్రూప్ పై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ.. ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లో జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన 70 కార్యాలయాలపై ఇవాళ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. ఉగ్రవాద సంస్థకు చెందిన నేతలు, వర్కర్లు, సానుభూతిపరుల ఇళ్లను సీజ్ చేశారు. జమాతే ఇస్లామీకి సంబంధమున్న అన్ని సంస్థలు, ఆఫీస్ లను మూసివేయాలన్న జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలతో అధికారులు సోదాలు చేసి… సీజ్ చేశారు. గడిచిన 4 రోజులుగా జేఈఐ సంస్థకు చెందిన 2వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్ కు జమాతే ఇస్లామీ సంస్థ నిధులు సమకూరుస్తుందనడానికి కశ్మీర్  పోలీసులు ఆధారాలు సంపాదించారు. రూ.52 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. జమాతే ఇస్లామీ సంస్థ ముఖ్య నాయకుల బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా NIA అధికారులు వేర్పాటువాదుల ఇళ్లలో సోదాలు జరుపుతూ వచ్చారు. వారు సేకరించిన సమాచారంతో ఈ చర్యలు తీసుకున్నారు.