రోడ్డుపైనుంచి నదిలో పడ్డ స్కార్పియో .. ఐదుగురు ప్రయాణికులు కొట్టుకుపోయారు

రోడ్డుపైనుంచి నదిలో పడ్డ స్కార్పియో .. ఐదుగురు ప్రయాణికులు కొట్టుకుపోయారు

జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.దచ్చన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న  కారులో రోడ్డుపై నుంచి చీనాబ్ నదిలో పడింది. శనివారం(ఆగస్టు15) ఉదయం10.50 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాదానికి గురైన స్కార్పియో కారు  హర్యానాకు చెందిన డాంగ్ దారు నుంచి సౌందర్ కు వెళ్తున్నట్లు గుర్తించారు. 

మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహనం ఇంకా కొంతమంది ఉన్నట్లు   తెలుసుకున్న రెస్క్యూటీం, స్థానికులతో కలిసి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపౌ  జమ్మూకాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సంతాపం తెలిపారు.