
అంతర్జాతీయ టీ20ల్లో మరో విధ్వంసకర ఇన్నింగ్స్ సంచలనంగా మారుతోంది. నమీబియా ప్లేయర్ జాన్ ఫ్రైలింక్ విధ్వంసకర అట తీరుతో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. కొడితే సిక్సర్ లేకపోతే బౌండరీ అనేట్టుగా ఆడుతూ కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గురువారం (సెప్టెంబర్ 18) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించాడు. 13 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న ఈ నమీబియా ఓపెనర్ ఓవరాల్ గా 31 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఫ్రైలింక్ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
టీ20 క్రికెట్ లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఏరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత టీమిండియా యువ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 13 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన లిస్ట్ లో ఫ్రైలింక్ ముందు ముగ్గురు ఉన్నారు.
ఈ మ్యాచ్ లో ఫ్రైలింక్ ధాటికి బౌండరీల వర్షం కురిసింది. ట్రెవర్ గ్వాండు వేసిన నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు సహా 26 పరుగులు రాబట్టడం టోర్నీ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. అతని ధాటికి తొలి నాలుగు ఓవర్లలోనే నమీబియా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫ్రైలింక్ తో పాటు రూబెన్ ట్రంపెల్మాన్ 24 బంతుల్లోనే 46 పరుగులు చేసి భారీ సజోరె చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. భారీ ఛేజింగ్ లో ఆతిధ్య జింబాబ్వే తడబడుతోంది. ప్రస్తుతం 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసిఓటమి అంచుల్లో నిలిచింది.
A 13-ball fifty for Jan Frylinck, the joint third-fastest in T20Is ⚡
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2025
Scorecard 👉 https://t.co/ywU3JYBHB4 pic.twitter.com/MUNCgTc6kZ