పీసీసీ స్పందించకుంటే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తా

పీసీసీ స్పందించకుంటే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తా

పార్టీని బలహీన పరిచే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. పీసీసీ స్పందించకుంటే హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యక్తులను టార్గెట్ చేస్తూ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారన్నారు. పార్టీల అభిమానుల పోస్టులు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇలాంటి వార్తల వల్ల ఉపయోగం లేదన్నారు. పరుష పదాలతో అవమాన పరిస్తే మొత్తం పార్టీకి నష్టం జరగనుందన్నారు. అభిమానులను వారి నాయకత్వం సరి చేయాలన్నారు. లేదంటే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అలాంటి వారిపై  పీసీసీ చర్యలు తీసుకోవాలని..లేదంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పీసీసీ నాయకత్వం సమావేశమై.. అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలన్నారు.

తెలంగాణలో వివిధ హోదాలలో 4.90 లక్షల ఉద్యోగాల కల్పన సృష్టించింది కాంగ్రెస్సేనన్నారు. ఈ ఏడేళ్లలో ఉన్న ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారన్నారు. 30 ఏళ్ల కింద అమ్మిన ఇళ్లుకు  కూడా భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. 20 నుంచి 30 ఊర్ల పేర్లు చెబుతానని..అక్కడికి మీడియా వెళ్లి భగీరథ నీళ్లు వస్తున్నాయో  లేదో చూడాలన్నారు. పీవీ కూతురికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. పీవీ నరసింహారావు దేశానికి ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్.. అంతకంటే గౌరవం ఇంకేముందున్నారు. .