జనగామ, వెలుగు: మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిపై ‘పోష్’ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జనగామ కలెక్టరేట్లోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ మహిళ ఫొటోలు తీసిన ఏవో విజయ్‌రెడ్డి వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్చేశాడు. వాటికి అసభ్యకరమైన కామెంట్స్జత చేశాడు.
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని విజయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాక్ష్యాల ఆధారంగా విజయ్ రెడ్డిపై ‘పోష్’(పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు) యాక్ట్2013 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి నట్లు చెప్పారు.
