70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్.. ఎన్ఐటీ కాలికట్ నిఖిల్ ను సన్మానించిన టూరిజం ఆఫీసర్లు

70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్.. ఎన్ఐటీ కాలికట్ నిఖిల్ ను సన్మానించిన టూరిజం ఆఫీసర్లు

యువకుడు, ఎన్ఐటీ కాలికట్  విద్యార్థి నిఖిల్  కుమార్  హెరిటేజ్  రన్  నిర్వహించాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ టెంపుల్  నుంచి 70 కిలోమీటర్లు రన్  నిర్వహించి ఆదివారం ఉదయం హనుమకొండలోని ఏకశిలా పార్క్ కు చేరుకున్నాడు. 

గుంజేడు నుంచి పాకాల సరస్సు, కొమ్మాల నర్సింహస్వామి టెంపుల్, వరంగల్  కోట, భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల గుడి మీదుగా ఈ రన్  కొనసాగించగా.. ఏకశిలా పార్క్  వద్ద నిఖిల్ కుమార్ ను టూరిజం ఆఫీసర్లు సత్కరించారు. 

తెలంగాణ పర్యాటక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటడంతో పాటు యువతలో ఫిట్‌‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించాలనే సంకల్పంతోనే  ఈ హెరిటేజ్  రన్  నిర్వహించినట్లు నిఖిల్ తెలిపాడు. కార్యక్రమంలో టూరిజం ఆఫీసర్లు సూర్య కిరణ్, లోకేశ్, చిరంజీవి పాల్గొన్నారు.