హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో పీసీసీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. బ్యాండ్ మేళాలు, భాజాభజంత్రీలతో గాంధీ భవన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. పటాకులు కాల్చి, కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.
అనంతరం సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల మద్దతు ఉండాలని ఆకాంక్షించారు.
