రూ. కోటి 20 లక్షల పంట కొనుగోలు చేసి.. 30 లక్షలే చెల్లించి.. మిర్చీ రైతులను ముంచిన దళారులు..

 రూ. కోటి 20 లక్షల పంట కొనుగోలు చేసి.. 30 లక్షలే చెల్లించి.. మిర్చీ రైతులను ముంచిన దళారులు..

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్  భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరు దళారులను అరెస్ట్​ చేసి రిమాండ్ కు పంపినట్లు చిట్యాల సీఐ మల్లేశ్  తెలిపారు. రంగాపురం గ్రామానికి చెందిన ఫర్టిలైజర్  షాప్  ఓనర్​ బాల్తే రాజు, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడుకు చెందిన జంగం రమేశ్, అక్కంపేటకు చెందిన శాతరాజు రాజు, శాతరాజు స్వప్న కలిసి రంగాపురం గ్రామంలోని రైతుల నుంచి రూ.1.20 కోట్ల మిర్చి పంటను కొనుగోలు చేశారు. 

ఇందులో రూ.30 లక్షలు మాత్రమే చెల్లించి, మిగిలిన డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేశారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జంగం రమేశ్, శాతరాసి రాజును అరెస్ట్​ చేసి రిమాండ్  తరలించినట్లు సీఐ తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.