పోలీస్ రిక్రూట్ మెంట్ లో నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని కాంగ్రెస్ సీనియన్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనలు సవరించాలన్న నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వారికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన చేసిన విషయాన్ని జానారెడ్డి గుర్తు చేశారు. తెలిపారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరసనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. సమస్య పరిష్కారం విషయంలోనూ అంతే చిత్తశుద్ధితో వ్యవహరించాలని జానారెడ్డి సూచించారు. అరెస్టు చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళనచేస్తున్న వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని జానారెడ్డి కోరారు.
