చందు నాయక్‌‌‌‌ను కోర్టులో హాజరుపరచాలి

చందు నాయక్‌‌‌‌ను కోర్టులో హాజరుపరచాలి

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జనసేన నాయకుడు చందు నాయక్‌‌‌‌ను హైదరాబాద్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌లోని సీసీఎస్ కార్యాలయం ఎదుట చందునాయక్​కుటుంబసభ్యులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని దూషించాడన్న ఆరోపణలతో చందు నాయక్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని చెప్పడం లేదని ఆరోపించారు. 

గతంలో ముఖ్యమంత్రిపై పలువురు విమర్శలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం జనసేన నాయకుడు కావడం వల్లే చందు నాయక్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయనను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.