తెలంగాణలో జనసేన 'అడ్ హాక్..రాష్ట్ర కమిటీలను రద్దు పవన్ కల్యాణ్

తెలంగాణలో జనసేన 'అడ్ హాక్..రాష్ట్ర కమిటీలను రద్దు  పవన్ కల్యాణ్
  •  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్

హైదరాబాద్: జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర కమిటీలను రద్దు చేశారు.. అయితే, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించారు. రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహె చ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటిస్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు 30 రోజుల పాటు పనిచే యనున్నాయి. ప్రతి నియోజకవర్గం, జీహెచ్ఎంసీ  పరిధిలోని 300 వార్డుల్లో పర్యటించి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాలను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి అందజేయనున్నారు. త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను ప్రకటించనున్నారు.