టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలి: జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, వెలుగు: రెసిడెన్షియల్​ స్కూల్స్, కాలేజీల్లో స్టూడెంట్స్ అందించే ఆహార పదార్థాల సరఫరా టెండర్​ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా ఆదేశించారు. 2026--–27 సంవత్సరానికి గాను రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలకు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సప్లయ్​ చేయడానికి కలెక్టరేట్​లో జిల్లా కొనుగోలు కమిటీ మీటింగ్ జరిగింది. 

ఈ సందర్భంగా టెండర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, ఈఎండీ సహా ఇతర అంశాలపై ఆయన రివ్యూ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12 లోపు  టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మీటింగ్​లో వెల్ఫేర్​ ఆఫీసర్లు నరసింహ రావు, విక్రమ్, డీసీఎస్​వో సురేశ్ రెడ్డి, ఇండస్ట్రీయల్​ జీఎం సల్మా యాస్మిన్, సీఎస్సీ డీఎం యాకుబ్ పాషా ఉన్నారు.