ఫోటోగ్రాఫర్పై జయా బచ్చన్ ఆగ్రహం

ఫోటోగ్రాఫర్పై జయా బచ్చన్ ఆగ్రహం

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ భార్య  జయా బచ్చన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫోటోలు తీసేందుకు  ప్రయత్నించిన ఓ ఫోటోగ్రాఫర్ పై ఆమె సీరియస్ అయ్యారు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

అమితాబ్ బచ్చన్ తో కలిసి జయా బచ్చన్ బుధవారం ఇండోర్ ఎయిర్ పోర్ట్ కు చేరారు. అక్కడ  దంపతులిద్దరికి పూలమాలలు వేసి..  బొకేలతో పలువురు స్వాగతం పలికారు. అయితే  ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు. అయినా అతను వినకుండా అలాగే ఫోటోలు తీయడంతో జయాబచ్చన్ అసహనం వ్యక్తం చేశారు. నా ఫోటో తీయొద్దు..నీకు ఇంగ్లీష్ అర్థం కాలేదా? అంటూ ఫోటోగ్రాఫర్ పై  ఫైర్ అయ్యారు. ఆ సమయంలో ఆమె వెనుకనే ఉన్న అమితాబ్ బచ్చన్ సైలెంట్ గా ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.