టీచర్లు కావాలంటూ స్టూడెంట్ల రాస్తారోకో

టీచర్లు కావాలంటూ స్టూడెంట్ల రాస్తారోకో

మల్హర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం జడ్పీ హైస్కూల్​లో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ టీచర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం స్టూడెంట్స్ రాస్తారోకోకు దిగారు. ఇంగ్లీష్ టీచర్ లేకపోవడంతో ఒక్కో స్టూడెంట్​రూ.1000 చొప్పున స్కూల్ యాజమాన్యానికి చెల్లించామని, ఆ డబ్బులతో ప్రైవేట్ ఇంగ్లీష్ టీచర్ ను రూ.15 వేల జీతానికి నియమించారన్నారు. ఇది ప్రైవేట్ స్కూలా లేక గవర్నమెంట్ స్కూలా అర్థం కావడం లేదని అన్నారు. ఉన్న మ్యాథమెటిక్స్ టీచర్ ను ఇప్పుడు డిప్యుటేషన్ పై వేరే ప్రాంతానికి బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూల్​లో 6 నుంచి 10వ తరగతి వరకు 102 మంది స్టూడెంట్స్ ఉన్నారని, టీచర్ల కొరతపై స్కూల్​ఎస్ఎంసీ చైర్మన్, పేరెంట్స్ కలిసి డీఈవో కు వినతిపత్రం అందించినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. టీచర్లు లేకపోవడంతో సిలబస్ పూర్తి కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యాథమెటిక్స్ టీచర్ డిప్యుటేషన్ రద్దు చేయాలని, ఇంగ్లీష్ టీచర్ ను నియమించాలని డిమాండ్​చేశారు.