కుండపోత వర్షం... వరదల్లో చిక్కుకున్న జీపు 

కుండపోత వర్షం... వరదల్లో చిక్కుకున్న జీపు 

కేరళలో భారీ వర్షాలు  కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కేరళలోని కన్నూర్ లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే ఈ  వరద నీటిలో  ఓ జీపు చిక్కుకుపోయింది.  ఆ జీపును బయటికి తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కేరళలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ తీరంలో గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు తెలియజేసింది. త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలతో సహా ఆరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను అధికారులు ప్రకటించారు.