TRS అరాచక పాలనకు సార్సాల నుండే చరమ గీతం ప్రారంభం : జీవన్ రెడ్డి

TRS అరాచక పాలనకు సార్సాల నుండే చరమ గీతం ప్రారంభం : జీవన్ రెడ్డి

మంచిర్యాల జిల్లా: ఎన్నికల  ముందు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న ఆదివాసీలను నిరాశ్రయులను చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గురువారం సార్సాల  గ్రామంలో పోడు భూముల్లో జరిగిన ఘర్షణపై నిజాలు ఏంటో తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ  నిజనిర్ధారణ కమిటీలో మాట్లాడారు జీవన్ రెడ్డి.

సీఎం కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించి ఇక్కడి భూములను దోపిడీ చేస్తున్నారని..ఆదివాసీలు, గిరిజనులు, అసలు విషయాలు వెలుగులోకి వస్తే తిరుగుబాటు చేస్తారని సార్సాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. TRS అరాచక పాలనకు సార్సాల నుండే చరమ గీతం  ఆరంభం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్న ఆయన.. చట్టం చెయ్యి దాటిపోతే బాధ్యత తెలంగాణ ప్రభుత్వందేనన్నారు.