కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం (2026 ఏప్రిల్ 10) సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ తదితరులు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు.
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత తో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లిన జీవన్ రెడ్డిని కేసీఆర్ ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
►ALSO READ | మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా : బరితెగించిన భూ మాఫియా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతాననే సంకేతాలు పంపడంతో.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పార్టీ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. గురువారం (ఏప్రిల్ 09) జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు.
