భారీగా తగ్గిన బెజోస్ సంపద

భారీగా తగ్గిన బెజోస్ సంపద
  • ఫోర్బ్స్ లిస్టులో  మూడో ప్లేస్‌‌కు పడిపోయిన అమెజాన్ బాస్‌‌

న్యూఢిల్లీ: అమెజాన్‌‌ ఫౌండర్  జెఫ్‌‌ బెజోస్ ఒకే రోజులో 20.5 బిలియన్ డాలర్లు (రూ. 1.55 లక్షల కోట్లు) నష్టపోయారు. కంపెనీ రిజల్ట్స్‌‌ ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో  శుక్రవారం సెషన్‌‌ (యూఎస్‌‌) లో అమెజాన్‌‌ షేరు 14  శాతం  నష్టపోయింది. దీంతో బెజోస్ సంపద  భారీగా తగ్గింది. ఫోర్బ్స్ రియల్‌‌ టైమ్ బిలియనీర్‌‌‌‌ ఇండెక్స్‌‌లో బెజోస్ (150 బిలియన్ డాలర్లు)  మూడో ప్లేస్‌‌కు పడిపోగా, లూయిస్‌‌ విట్టన్ బాస్ బెర్నార్డ్‌‌ ఆర్నాల్ట్‌‌ (159 బిలియన్ డాలర్లు) రెండో ప్లేస్‌‌కు చేరుకున్నారు. టెస్లా బాస్‌‌ ఎలన్ మస్క్ (246 బిలియన్ డాలర్లు) మొదటి ప్లేస్‌‌లో కొనసాగుతున్నారు. జెఫ్‌‌ బెజోస్ సంపద ఈ ఏడాది 210 డాలర్ల వరకు పెరిగి అక్కడి నుంచి కిందకి పడుతోంది. యూఎస్ మార్కెట్లు శుక్రవారం పడడంతో గ్లోబల్‌‌గా టాప్ 500 మంది ధనవంతులు ఒక్క సెషన్‌‌లోనే 54 బిలియన్ డాలర్లను నష్టపోయారు. యూఎస్ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లయిన ఎస్‌‌ అండ్ పీ 500 ఇండెక్స్ 3.6 శాతం, నాస్‌‌డాక్‌‌ 100 ఇండెక్స్ 4.5 శాతం క్రాష్ అయిన విషయం తెలిసిందే. 2008 తర్వాత నాస్‌‌డాక్‌‌కు ఇదే వరెస్ట్ నెల.  అమెజాన్‌‌కు మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో 3.8 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో కంపెనీ ప్రాఫిట్ 8.1 బిలియన్ డాలర్లు కావడం గమనించాలి. కంపెనీకి మార్చి క్వార్టర్‌‌లో నష్టాలు రావడం, ఇన్‌‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో సేల్స్ పడిపోవడం వంటి అంశాలు అమెజాన్ షేరు పడడానికి కారణమవుతున్నాయి.