ఈ పీపీఈ కిట్ ను రెయిన్ కోట్ గానూ వాడొచ్చు!

ఈ పీపీఈ కిట్ ను రెయిన్ కోట్ గానూ వాడొచ్చు!

మల్టీ పర్పస్ కరోనా కిట్ ను తయారు చేసిన ఝాన్సీ పోలీసులు
ఝాన్సీ: ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా పోలీసులు ఓ వినూత్న కిట్ ను యారు చేశారు. కరోనాతోపాటు వర్షాకాలంలో వాను నుంచి రక్షణగా ఉండేలా ట్రాన్సపరెంట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్ ను రూపొందించారు. కరోనా నుంచి రక్షణతోపాటు వర్షా కాలంలో తడవకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. వీటి తయారీకి లోకల్ వెండర్ కు 1,000 పీసెస్ ను పోలీసులు ఆర్డర్ చేశారు. తొలి దశలో వివిధ యూనట్లకి వీటిని డెలివర్ చేయనున్నారు.

‘పదిహేను రోజుల కింద నాకు ఈ ఆలోచన వచ్చింది. దీంతో కొన్ని పీసెస్ ను తయారు చేశాం. బార్డర్ డ్యూటీ చేస్తున్న వారు వ్యక్తిగతంగా దీన్ని యత్నించిన తర్వాతే కంఫర్టబుల్ అని నిర్ధారణకు వచ్చాం. హాట్ స్పాట్స్, క్వారంటైన్ సెంటర్స్, పోలీస్ రైడ్స్, అరెస్ట్ లు చేసే సమయంలో పోలీస్ యూనిఫామ్ కంపల్సరీగా కనిపించేలా దీన్ని రూపొందించాం’ అని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శ్రీవాత్సవ తెలిపారు. దీని ఖరీదు రూ. 400 అని ఆయన చెప్పారు.