మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా జితు పట్వారీ... ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్

మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా జితు పట్వారీ... ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మార్పులు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ను హై కమాండ్ ఆయన్ను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌ పదవి నుంచి తొలగించింది. తాజాగా ఆయన స్థానంలో రౌ మాజీ ఎమ్మెల్యే జితు పట్వారీని నియమించారు.

గిరిజన నాయకుడు ఉమంగ్ సింఘార్ ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. అతను గంద్వాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే అతేర్ ఎమ్మెల్యే హేమంత్ కటారేను ప్రతిపక్ష ఉపనేతగా నియమించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

జితు పట్వారీ ఎవరు?

1973లో బిజల్‌పూర్‌లో జన్మించిన జిత్ పట్వారీ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2020లో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. తొలిసారి 2013లో రావు విధాన సభ నుంచి పట్వారీ ఎమ్మెల్యే అయ్యారు. దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 163 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం 15 నెలల పదవీకాలాన్ని మినహాయించి, మధ్యప్రదేశ్ గత ఇరవై సంవత్సరాలుగా బీజేపీకి బలమైన కంచు కోటగా ఉంది.