కమలం గుర్తుకే ఓటేయండి: జీవిత రాజశేఖర్

కమలం గుర్తుకే ఓటేయండి: జీవిత రాజశేఖర్

మునుగోడులో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా సినీ నటి జీవిత రాజశేఖర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో ఆమె క్యాంపెయినింగ్ నిర్వహించారు. గ్రామంలో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరించారు. దేవలమ్మ నాగారానికి వచ్చిన జీవితకు అక్కడి మహిళలు ఘన స్వాగతం పలికారు. 

ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ కమలం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తానే స్వయంగా గోరింటాకుతో మహిళల చేతులపైన పువ్వు గుర్తు వేసి.. దానికే ఓటేయ్యాలని కోరారు. ఇదిలా ఉంటే.. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కీలక నేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించి మునుగోడులో అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.