జర్మనీ వర్సిటీలతో జేఎన్టీయూహెచ్ ఎంవోయూ

జర్మనీ వర్సిటీలతో జేఎన్టీయూహెచ్ ఎంవోయూ

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్​టీయూహెచ్​ స్టూడెంట్స్​కు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు వర్సిటీకి చెందిన ప్రతినిధులు జర్మనీలోని ప్రముఖ యూనివర్సిటీలను సందర్శిస్తున్నారు. జేఎన్​టీయూహెచ్​ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్​కుమార్​రెడ్డి, రిజిస్ట్రార్​ డాక్టర్​ వెంకటేశ్వర్​రావుల బృందం ఆదివారం జర్మనీలోని రాయుట్లింగెన్, యూనివర్సిటీ ఆఫ్​ కాసెల్​ను సందర్శించారు. 

ఇంటిగ్రేటెడ్​ ఇంటర్నేషనల్​ బీటెక్​ అండ్​ ఎంఐటెక్​ కోర్సు కోసం రాయుట్లింగెన్​ యూనివర్సిటీతో, డబుల్​ డిగ్రీ మాస్టర్స్​ ప్రోగ్రాం, స్టూడెంట్స్​ ఎక్సేంజ్​, జాయింట్​ రీసెర్చ్​ తదితర అంశాలపై యూనివర్సిటీ ఆఫ్​ కాసెల్​తో పరస్పర సహకారం కోసం నాలెడ్జ్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. 

అనంతరం పరిశ్రమలు – విద్య అనుసంధానంలో భాగంగా మెర్సిడెస్​ బెంజ్​ పరిశ్రమను సందర్శించి.. అధ్యాపక శిక్షణ, పాఠ్య ప్రణాళికల్లో కొత్తదనం అంశాలపై చర్చించారు.