రేపు వికారాబాద్ లో జాబ్ మేళా

రేపు వికారాబాద్ లో జాబ్ మేళా

వికారాబాద్, వెలుగు : జిల్లా కేంద్రం ఐటీఐ క్యాంపస్ లోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసులో గురువారం ఉదయం 10: 30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. ఎస్ బీఐ కార్డ్స్ (థర్డ్ పార్టీ రోల్ )లో  సుమారు 50 ఉద్యోగాలు ఉన్నట్లు.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు.

వికారాబాద్‌‌‌‌‌‌‌‌లోని అన్ని జిల్లాల శాఖలు, ప్రఖ్యాత ప్రైవేటు పరిశ్రమలు తమకు కావలసిన ఉద్యోగులను జాబ్ మేళా ద్వారా ఎంపిక చేసుకుంటాయని తెలిపారు. నిరుద్యోగులు  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియాసాబ్  ఫోన్ నం. 9676047444 లో సంప్రదించాలని సూచించారు.