పలు విభాగాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్స్..

పలు విభాగాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్స్..

బీఈసీఐఎల్​​లో 2684 పోస్టులు
బ్రాడ్‌‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌‌న్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్‌‌–నోయిడా) కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న 2684 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: స్కిల్డ్​ మ్యాన్‌‌ప‌‌వ‌‌ర్‌‌–1336, అన్‌‌స్కిల్డ్ మ్యాన్‌‌ప‌‌వ‌‌ర్‌‌–1342, క‌‌న్సల్టెంట్‌‌–4, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌‌–2; అర్హత‌‌: అన్​స్కిల్డ్​ మ్యాన్​పవర్​కు ఎనిమిదో త‌‌ర‌‌గ‌‌తి, స్కిల్డ్​ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌‌లో ఐటీఐ, మిగిలి వాటికి బీటెక్‌‌, బీకాం/ ఎంకాం/ ఎంబీఏ ఉత్తీర్ణత‌‌తో పాటు తగిన అనుభ‌‌వం ఉండాలి. వ‌‌య‌‌సు: 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.250. సెలెక్షన్ ప్రాసెస్​: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌రితేది: 2019 జూలై 25; వివరాలకు: www.becil.com

 

సశస్ర్త సీమాబల్​లో
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌‌‌‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాయుధ దళం న్యూఢిల్లీలోని స‌‌‌‌శ‌‌‌‌స్త్ర సీమా బ‌‌‌‌ల్ (ఎస్ఎస్‌‌‌‌బీ) స్పోర్ట్స్ కోటాలో 150 జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ డ్యూటీ కానిస్టేబుల్(గ్రూప్–సి) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. కేటగిరీ–ఖాళీలు: ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌–5, బాస్కెట్ బాల్‌‌‌‌–15, హాకీ–7, షూటింగ్ (స్పోర్ట్స్‌‌‌‌)–9, ఆర్చరీ–5, అథ్లెటిక్స్‌‌‌‌–37, జిమ్నాస్టిక్స్‌‌‌‌–7, రెజ్లింగ్‌‌‌‌–21, బాక్సింగ్‌‌‌‌–5, జూడో‌‌‌‌‌‌‌‌–10, వెయిట్​ లిఫ్టింగ్​–6, బాడీ బిల్డింగ్​–2, సైక్లింగ్​–3, ఈక్వెస్ర్టయన్​–3, బ్యాడ్మింటన్​–4, తైక్వాండో–8, స్విమ్మింగ్​–10; అర్హత‌‌‌‌: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు 2017 తర్వాత ఒలింపిక్స్, వరల్డ్​ కప్స్​, ఆసియా క్రీడలు వంటి వాటిలో దేశం తరపున పాల్గొని ఉండాలి. లేదా జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం సాధించాలి.  వయ‌‌‌‌సు: 18 నుంచి 23 ఏళ్ల మ‌‌‌‌ధ్య ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్​సర్వీస్​మెన్​కు ఫీజు లేదు. సెలెక్షన్​ ప్రాసెస్​: బ‌‌‌‌యోమెట్రిక్ ఎగ్జామినేష‌‌‌‌న్, స్పోర్ట్స్​ అచీవ్​మెంట్స్​ అండ్​ ఫీల్డ్ ట్రయ‌‌‌‌ల్‌‌‌‌, ఫిజిక‌‌‌‌ల్ స్టాండ‌‌‌‌ర్డ్ టెస్ట్‌‌‌‌, మెడిక‌‌‌‌ల్ ఎగ్జామినేష‌‌‌‌న్ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌‌‌రితేది: జూలై 13 – 19 ఎంప్లాయిమెంట్ న్యూస్‌‌‌‌ ఎడిషన్​లో నోటిఫికేషన్​ విడుదలైన నాటి నుండి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు: www.ssb.nic.in

 

ఆర్మీలో ఎన్‌‌‌‌సీసీ ఆఫీస‌‌‌‌ర్లు
ఎన్​సీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు షార్ట్ స‌‌‌‌ర్వీస్ క‌‌‌‌మిష‌‌‌‌న్ (ఎస్ఎస్‌‌‌‌సీ) ఆఫీస‌‌‌‌ర్లుగా చేరేందుకు ఇండియన్​ ఆర్మీ ప్రకటన విడుదల చేసింది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులకు 50, మహిళలకు 5, మొత్తం 55 పోస్టులున్నాయి. అర్హత‌‌‌‌: ఏదైనా బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌‌‌‌సీసీ–సి స‌‌‌‌ర్టిఫికెట్​​, నిర్దేశిత శారీర‌‌‌‌క ప్రమాణాలు కలిగి ఉండాలి. వ‌‌‌‌య‌‌‌‌సు: 2020 జూన్ 1 నాటికి 19 నుంచి 25 సంవ‌‌‌‌త్సరాల మ‌‌‌‌ధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్​: మెరిట్​, ఎస్​ఎస్‌‌‌‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్​ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌‌‌రితేది: 2019 ఆగస్టు 8; వివరాలకు: www.joinindianarmy.nic.in

 

ఎస్​వీ యూనివర్శిటీలో 293 కన్సల్టెంట్లు
శ్రీ వెంక‌‌‌‌టేశ్వర యూనివ‌‌‌‌ర్శిటీ (ఎస్‌‌‌‌వీయూ–తిరుపతి) కాంట్రాక్టు ప్రాతిప‌‌‌‌దిక‌‌‌‌న 293 అక‌‌‌‌డ‌‌‌‌మిక్ క‌‌‌‌న్సల్టెంట్‌‌‌‌/కోఆర్డినేటర్​ పోస్టుల భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికయిన వారు వర్శిటీ విద్యాసంస్థల్లో ఏడాది కాలానికి పనిచేయాల్సి ఉంటుంది. ఖాళీలు: ఆర్ట్స్‌‌‌‌–78, సైన్సెస్‌‌‌‌–49, ఇంజినీరింగ్‌‌‌‌–48, సెల్ఫ్ స‌‌‌‌పోర్టింగ్ కోర్సులు–118; అర్హత‌‌‌‌: పోస్టును బట్టి స‌‌‌‌ంబంధిత స‌‌‌‌బ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా స్లెట్/సెట్​ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్ ఎక్స్​పీరియన్స్​ ఉన్న వారికి ప్రాధాన్యత. ఫీజు: జనరల్​/ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలకు రూ.300; సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ద్వారా; చివ‌‌‌‌రితేది: 2019 జూలై 25; వివరాలకు: www.svudoa.in

 

ప్రసార భార‌‌‌‌తిలో..
న్యూఢిల్లీలోని ప్రసార భార‌‌‌‌తి దేశవ్యాప్తంగా దూరదర్శన్​ కేంద్ర, ఆల్​ ఇండియా రేడియోల్లో కాంట్రాక్టు ప్రాతిప‌‌‌‌దిక‌‌‌‌న 60 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈమెయిల్​ ద్వారా అప్లై చేసుకోవాలి. అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్‌‌‌‌), పీజీ డిప్లొమా (మార్కెటింగ్‌‌‌‌) ఉత్తీర్ణత‌‌‌‌. ఎగ్జిక్యూటివ్  పోస్టుకు ఏడాది, ఎగ్జిక్యూటివ్​ (గ్రేడ్​–I) పోస్టుకు నాలుగేళ్ల అనుభ‌‌‌‌వం తప్పనిసరి. వ‌‌‌‌య‌‌‌‌సు: 35 ఏళ్లకు మించ‌‌‌‌కూడ‌‌‌‌దు. సెలెక్షన్​ ప్రాసెస్​: రిటెన్​ టెస్ట్‌‌‌‌, ఇంట‌‌‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌‌‌రితేది: 2019 ఆగస్టు 6; వివరాలకు: www.prasarbharati.gov.in

 

హైద‌‌‌‌రాబాద్ క‌‌‌‌లెక్టరేట్‌‌‌‌లో 37 పోస్టులు
దివ్యాంగ‌‌‌‌ అభ్యర్థుల‌‌‌‌కు హైద‌‌‌‌రాబాద్ జిల్లా క‌‌‌‌లెక్టరేట్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌‌‌‌లో కేటాయించిన 37 బ్యాక్‌‌‌‌లాగ్ పోస్టుల (గ్రూప్​–4) భ‌‌‌‌ర్తీకి డిస్ర్టిక్ట్​ సెలెక్షన్​ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో పోస్ట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు: జూనియ‌‌‌‌ర్ అసిస్టెంట్ కం టైపిస్ట్‌‌‌‌/ టైపిస్ట్–4, ల్యాబ్ టెక్నీషియ‌‌‌‌న్–2, ల్యాబ్ అటెండెంట్–2, హెచ్‌‌‌‌డ‌‌‌‌బ్ల్యూఓ (గ్రూప్–2)–1, క‌‌‌‌మాటి–3, స్వీప‌‌‌‌ర్–3, జూనియర్ అసిస్టెంట్/ టెలిఫోన్ ఆప‌‌‌‌రేట‌‌‌‌ర్–5, డార్క్ రూం అసిస్టెంట్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్‌‌‌‌–2)–2, బుక్ బేర‌‌‌‌ర్–1, ఆఫీస్ స‌‌‌‌బార్డినేట్స్–7, చౌకీదార్–1, గేట్ పోర్టర్–1, కుక్–1, అసిస్టెంట్ దోబీ–1, స్కావెంజ‌‌‌‌ర్–1, మాలీ–1; అర్హత‌‌‌‌: పోస్టును బట్టి ఐదో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి నుంచి ఐటీఐ, ఇంటర్, బ్యాచిల‌‌‌‌ర్ డిగ్రీ, బీఈడీ, ఇతర స‌‌‌‌ర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత‌‌‌‌ మరియు తగిన అనుభ‌‌‌‌వం కలిగి ఉండాలి. వినికిడి లోపం గలవారికి 75 శాతం, మిగిలిన వారికి 40 శాతం డిసెబిలిటీ ఉండాలి. వయసు: 2019 జూలై 1 నాటికి 54 ఏళ్లకు మించ‌‌‌‌కూడ‌‌‌‌దు; చివరితేది: 2019 జూలై 25; వివరాలకు: www.hyderabad.telangana.gov.in

 

ఇఫ్లూలో 52 టీచింగ్ పోస్టులు
ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ‌‌‌‌స్ యూనివ‌‌‌‌ర్శిటీ (ఇఫ్లూ) హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, షిల్లాంగ్‌‌‌‌, ల‌‌‌‌క్నోలోని క్యాంపస్​ల్లో 52 టీచింగ్‌‌‌‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వెబ్​సైట్ ​నుంచి దరఖాస్తు డౌన్​లోడ్​ చేసుకొని పూర్తి వివరాలు నింపి పోస్ట్​ ద్వారా పంపాలి. ఖాళీలు: ప్రొఫెస‌‌‌‌ర్–15, అసోసియేట్‌‌‌‌ ప్రొఫెస‌‌‌‌ర్‌‌‌‌–24, అసిస్టెంట్ ప్రొఫెస‌‌‌‌ర్‌‌‌‌–13; అర్హత: ఆయా సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌‌‌‌డీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌‌‌‌ లేదా స్లెట్/ సెట్ క్వాలిఫై అయి తగిన అనుభ‌‌‌‌వం కలిగి ఉండాలి. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌‌‌‌బ్ల్యూడీల‌‌‌‌కు ఫీజు లేదు. చివరితేది: 2019 ఆగస్టు 14; వివరాలకు: www.efluniversity.ac.in

 

బీవోబీలో స్పెషలిస్ట్​ ఆఫీసర్లు
గుజ‌‌‌‌రాత్‌‌‌‌లోని వ‌‌‌‌డోద‌‌‌‌ర ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బ‌‌‌‌రోడా (బీవోబీ) 35 ఐటీ స్పెష‌‌‌‌లిస్ట్ ఆఫీస‌‌‌‌ర్ పోస్టుల‌‌‌‌ భ‌‌‌‌ర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపికయినవారు హైదరాబాద్​, ముంబయిలో బ్యాంక్​ల్లో పని చేయాల్సి ఉంటుంది. ఖాళీలు: ఐటీ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌–25, సీనియ‌‌‌‌ర్ ఐటీ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌–10; అర్హత‌‌‌‌: బీసీఏ/ఎంసీఏ/బీఈ/ బీటెక్‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో తగిన అనుభ‌‌‌‌వం ఉండాలి. వయ‌‌‌‌సు: మేనేజ‌‌‌‌ర్లకు 25 నుంచి 32, సీనియ‌‌‌‌ర్ మేనేజ‌‌‌‌ర్లకు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: ఆన్‌‌‌‌లైన్ టెస్ట్, ఇంట‌‌‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చివ‌‌‌‌రితేది: 2019 ఆగస్టు 2; వివరాలకు: www.bankofbaroda.in

 

ఐవోసీఎల్​లో 230 అప్రెంటీస్​లు
ఇండియన్​ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 230 టెక్నీషియన్​, ట్రేడ్​ అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: టెక్నీషియన్​ అప్రెంటీస్​‌‌‌‌‌‌‌‌కు కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా, ట్రేడ్​ అప్రెంటీస్​లకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: 24 సంవత్సరాలకు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్​: 2019 ఆగస్టు 8; ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ టెస్ట్​: 2019 ఆగస్టు 18; వివరాలకు: www.ioclrecruit.com

మంగ‌‌‌‌ళూరు రిఫైన‌‌‌‌రీలో..
కర్ణాటకలో ఉన్న మంగ‌‌‌‌ళూరు రీఫైన‌‌‌‌రీ అండ్ పెట్రోకెమిక‌‌‌‌ల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌‌‌‌పీఎల్‌‌‌‌) వివిధ విభాగాల్లో 12 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: చీఫ్ మేనేజ‌‌‌‌ర్–2, సీనియ‌‌‌‌ర్ మేనేజ‌‌‌‌ర్–1, మేనేజ‌‌‌‌ర్‌‌‌‌–2, అసిస్టెంట్ మేనేజ‌‌‌‌ర్‌‌‌‌–4, ఎగ్జిక్యూటివ్‌‌‌‌–3; అర్హత: పోస్టును బట్టి ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. చివరితేది: 2019 ఆగ‌‌‌‌స్టు 17; వివరాలకు: www.mrpl.co.in

నోయిడా మెట్రోలో 199 పోస్టులు
బ్రాడ్‌‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌‌న్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌‌న్‌‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన 199 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు–ఖాళీలు: స్టేష‌‌న్ కంట్రోల‌‌ర్/ట్రైన్ ఆప‌‌రేట‌‌ర్‌‌–9, క‌‌స్టమ‌‌ర్ రిలేష‌‌న్స్ అసిస్టెంట్‌‌–16, జూనియ‌‌ర్ ఇంజినీర్‌‌–35, మెయింటైన‌‌ర్‌‌–135, అకౌంట్స్ అసిస్టెంట్‌‌–3, ఆఫీస్ అసిస్టెంట్–1; అర్హత: పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌‌, బీకాం/ సీఏ ఇంట‌‌ర్/ ఐసీడ‌‌బ్ల్యూఏ, బీబీఏ/ బీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్​ టెస్ట్​, స్కిల్​ టెస్ట్​, గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్​ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: 2019 జూలై 22; చివరితేది: 2019 ఆగస్టు 21;వివరాలకు: www.becil.com

 

సౌత్ ఇండియన్ బ్యాంక్‌‌లో..
సౌత్ ఇండియన్ బ్యాంక్‌‌ (ఎస్​ఐబీ) 12 ప్రొబేషనరీ లీగల్ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: కనీసం 60 శాతం  మార్కులతో ఎల్​ఎల్​బీ ఉత్తీర్ణత. ఎక్స్​పీరియన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఫీజు: జనరల్​/ఓబీసీలకు రూ.800 కాగా ఎస్సీ/ఎస్టీలకు రూ.200; చివరితేది: 2019 జూలై 28; పరీక్షతేది: 2019 ఆగస్టు 11;  వివరాలకు:  www.southindianbank.com.

కేరళ బయోడైవర్శిటీ బోర్డ్​లో
కేరళ స్టేట్​ బయోడైవర్శిటీ బోర్డ్​(కేఎస్​బీబీ) బయోడైవర్శిటీ కన్సర్వేషన్​లో 25 ఇంటర్న్​షిప్​ల కోసం ప్రకటన విడుదల చేసింది. ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. రెండు నెలల పాటు సాగే ఇంటర్న్‌‌షిప్​లో నెలకు రూ.5000 స్టైపెండ్ ఇస్తారు. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. అభ్యర్థులు సొంత ల్యాప్​ట్యాప్ కలిగి ఉండాలి. చివరితేది: 2019 జూలై 31; వివరాలకు: www.keralabiodiversity.org

సెయిల్‌‌లో 361 ఖాళీలు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌‌).. రూర్కెలా స్టీల్​ ప్లాంట్​కు చెందిన సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​లో 361 మెడికల్​ ఎగ్జిక్యూటివ్​, పారామెడికల్ స్టాఫ్​ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఖాళీలు: మెడిక‌‌ల్ ఎగ్జిక్యూటివ్–23, పారామెడిక‌‌ల్ పోస్టులు–338; అర్హత‌‌: పోస్టును బట్టి పదోతరగతి, ఇంట‌‌ర్‌‌, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌‌, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణత‌‌తో పాటు తగిన అనుభ‌‌వం ఉండాలి. ఫీజు: రూ.500; సెలెక్షన్​ ప్రాసెస్: రిటెన్​ టెస్ట్​, స్కిల్‌‌/ ట్రేడ్ టెస్ట్‌‌, ఇంట‌‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ద‌‌ర‌‌ఖాస్తులు ప్రారంభం: 2019 జూలై 25; చివరితేది: 2019 ఆగస్టు 20; వివరాలకు: www.sailcareers.com