క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు: వందో టెస్ట్‌లో 100 కొట్టిన జో రూట్‌

క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు: వందో టెస్ట్‌లో 100 కొట్టిన జో రూట్‌

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచ‌రీ కొట్టాడు. 164 బాల్స్ లోనే 12 ఫోర్ల‌తో రూట్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో అత‌నికిది 20వ సెంచ‌రీ కాగా.. ఇది అత‌నికి వందో టెస్ట్ కావ‌డం విశేషం. అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో 98,99,100వ మ్యాచులో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా కూడా రూట్ రికార్డు సృష్టించాడు.

ఇప్పటివరకు 9 మంది ప్లేయర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించారు. కోలిన్ చౌదరీ, జావెద్ మియాందాద్, గార్డెన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టివార్ట్, ఇంజిమాముల్ హాక్, రికీ పాంటింగ్ (రెండు సెంచరీలు), గ్రేమ్ స్మిత్, హషీం ఆమ్లా తమ వందో టెస్టులో సెంచరీలు నమోదు చేయగా, ఇప్పుడు వారి సరసన రూట్ చేరాడు.

ఈ మ్యాచ్ లో 63 రన్స్ కే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ను సిబ్లీతో క‌లిసి రూట్ ఆదుకున్నాడు. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రూ క‌లిసి మూడో వికెట్‌కు 160కిపైగా రన్స్ జోడించారు. అటు సిబ్లీ కూడా సెంచ‌రీ వైపు అడుగులు వేస్తున్నాడు.