మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారు: జాయింట్ సీపీ

మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారు: జాయింట్ సీపీ

కాంగ్రెస్ పోస్టులపై కేసులు నమోదయ్యాయని సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ అన్నారు. ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని చెప్పారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురిని కస్టడీకి తీసుకుని నోటీసులు ఇచ్చామని చెప్పారు. వారి నుంచి పది లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశామన్నారు. టెక్నాలజీ సాయంతో లోకేషన్ ను కనుక్కున్నామని చెప్పారు. ఇన్ని రోజులు రహస్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెల్లడించారు. 

ప్రధాని మోడీ వచ్చి కంప్లైంట్ చేయలేరు కదా!: జాయింట్ సీపీ

సైబర్ క్రైమ్ పీఎస్ తో పాటు మరో నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని జాయింట్ సీపీ చెప్పారు. ఫిర్యాదుదారుల గురించి మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ వచ్చి స్వయంగా కంప్లైంట్ చేయలేరు కదా ? అని ప్రశ్నించారు. అరెస్టైన ముగ్గురు.. సునీల్ కనుగోలుకు చెందిన మైన్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ ఆఫీస్ ను నడుపుతున్నారని జాయింట్  సీపీ తెలిపారు. లీగల్ గానే నోటీసులు ఇచ్చి రైడ్ చేశామని అన్నారు. మహిళలపైనా కించపరిచేలా పోస్టులు పెట్టారని గుర్తించామని జాయింట్ సీపీ వెల్లడించారు.