మెదక్ టౌన్, వెలుగు: నిజమైన, అర్హత గల జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలని మెదక్ కలెక్టర్, అక్రిడిటేషన్ కమిటీ చైర్‌పర్సన్ ప్రతిమాసింగ్ అన్నారు. మెదక్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో జరిగింది.
అక్రిడిటేషన్ కోసం దరఖాస్తులు ఎన్ని వచ్చాయని డీపీఆర్‌వో రామచంద్రరాజును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలన్నారు.
మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ప్రమాణాల ప్రకారం కార్డులు జారీ చేయాలన్నారు. అనర్హులుకు కార్డులు జారీ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జిలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.

