బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

V6 Velugu Posted on Dec 07, 2021

న్యూఢిల్లీ: తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని ఆరోపించారు తరుణ్ చుగ్. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని తరుణ్ చుగ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పేదల కోసం మోడీ సర్కార్ పని చేస్తోందన్నారు. చేరికల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

 

Tagged teenmar mallanna, Telangana, CM KCR, MP Arvind, MP Bandi Sanjay, Tarun Chugh

Latest Videos

Subscribe Now

More News