వరుస సినిమాలతో పుల్ జోరులో ఉన్నారు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. మే 20 న తన 43 పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. దీంతో అభిమానుల్లో అప్పుడే పండుగ వాతావరణం మొదలైంది. ఈసారి రాబోయే పుట్టినరోజు మాత్రం ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, తారక్ బర్త్‌డే బ్లాస్ట్‌కు మేకర్స్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్ సిద్ధం చేశారు.
'డ్రాగన్' గర్జన లోడింగ్!
మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘NTRNEEL’ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్.. ఈసారి తారక్‌ను సరికొత్త రగ్గడ్, యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారు.లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మే 19 అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. అంతేకాదు, ఈ చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఎన్టీఆర్ సిల్హౌట్ లుక్, బ్యాక్ మజిల్స్ చూపిస్తూ "His reign... His soil..." అంటూ హైప్ పెంచేసారు. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
HIS REIGN… HIS SOIL…
— Jr NTR (@tarak9999) April 21, 2026
JUNE 11, 2027… IT IS…. #NTRNeel pic.twitter.com/ln9Dq4BFZs
త్రివిక్రమ్ కాంబో.. సర్‌ప్రైజ్!
ఇది మాత్రమే కాదు, నందమూరి అభిమానులకు మరో డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది. ‘అరవింద సమేత’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా మే 20న రిలీజ్ చేయడానికి మేకర్స్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
►ALSO READ | Allu Arjun: బన్నీ-సీరత్ ఫోటో వివాదం.. “అల్లు అర్జున్ ప్రాపర్టీ” కామెంట్లపై నటి ఘాటు రిప్లై
ఒకే రోజు ప్రశాంత్ నీల్ హై-వోల్టేజ్ యాక్షన్ అప్‌డేట్, త్రివిక్రమ్ మార్క్ క్లాసిక్ మాస్ అనౌన్స్‌మెంట్ రాబోతుండటంతో నందమూరి అభిమానులకు ఇది రియల్ ఫీస్ట్ అని చెప్పాలి. సో.. మే 19 అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో రికార్డుల వేట మొదలుకాబోతోంది,
🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋 𝐌𝐀𝐘 𝟐𝟎𝐓𝐇………🌋🌋🌋🌋🌋
— #NTRNeel (@NTRNeelFilm) May 11, 2026
🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋
