ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ సీరత్ కపూర్కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే బన్నీ-సీరత్ కపూర్లు కలిసి ప్రైవేట్ జెట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ తీవ్ర చర్చకు దారితీసింది. ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసి వరల్డ్ బాక్సాఫీస్ టార్గెట్ దిశగా వెళుతున్న అల్లు అర్జున్పై.. ఇలాంటి రూమర్ రావడంతో సదరు నెటిజన్పై అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ నెటిజన్ చేసిన కామెంట్ ఏంటీ? అల్లు అర్జున్-సీరత్ కపూర్ ఫోటోల వెనుక కథేంటి? అనేది క్లారిటీగా తెలుసుకుందాం.
ఇటీవల ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీతో కలిసి సీరత్ కపూర్ ప్రైవేట్ జెట్లో దిగిన అన్‌సీన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు విషెష్ తెలిపింది. ఆ విషెష్ చివర్లో లవ్ సింబల్ పెట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో బలమైన సంబంధం ఉందని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే, లేటెస్ట్గా ఒక నెటిజన్ సీరత్ పోస్టుకు “అల్లు అర్జున్ ప్రాపర్టీ” అంటూ అభ్యంతరకర కామెంట్ చేయడంతో చర్చ మళ్ళీ మొదలైంది.
ఇక ఆ వెంటనే సీరత్ కపూర్ తనపై వచ్చిన “అల్లు అర్జున్ ప్రాపర్టీ” కామెంట్‌పై ఘాటుగా స్పందించింది. “ లవ్ సింబల్ పెట్టినంత మాత్రాన ఒక మహిళ ఎప్పుడూ ఎవరి సొత్తు కాదు సార్. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం, కలలు, స్వరం ఉంటాయి. గౌరవంతో అభిమానించండి, సొంతంగా భావించొద్దు” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్ పీకింది. సీరత్ ఇచ్చిన ఈ రిప్లయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీరత్ స్పందనకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మహిళలను గౌరవించాలనే సందేశాన్ని ఆమె బలంగా చెప్పిందంటూ మద్దతు తెలుపుతున్నారు.
అల్లు అర్జున్కి సీరత్ విషెష్..
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సీరత్ షేర్ చేసిన పోస్టులో, ఆయనతో ఉన్న ఫోటోలతో పాటు స్పెషల్ నోట్ కూడా ఉంది. “హ్యాపీ బర్త్‌డే బన్నీ.. మీరు మీ కళను, సంబంధాలను ఎంతో సహజంగా, గ్రేస్‌ఫుల్‌గా, గ్రౌండెడ్‌గా తీసుకుంటారు. తెరపైన, తెర వెనుక మీకు అన్ని విధాల విజయాలు కలగాలని కోరుకుంటున్నాను.. ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను” అని చివర్లో లవ్ సింబల్ జోడించింది.
ఈ క్రమంలోనే నెటిజన్లు పలురకాలుగా ఊహించుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే, వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అనవసరంగా లేనిపోనిది యాడ్ చేసి రూమర్స్ క్రియేట్ చేయొద్దని సినీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యి ఆసక్తి పెంచాయి.
సీరత్ కపూర్ సినిమాలు..
సీరత్ కపూర్ 2014లో ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది 2’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాధ వినుమా’, ‘భామ కలాపం 2’, ‘మనమే’ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సీరత్ పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
సీరత్ కపూర్ ఫ్యామిలీ..
సీరత్ కపూర్ 1993 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి హోటలియర్ వినీత్ కపూర్, తల్లి ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ నీనా సిహోటా కపూర్. పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిన సీరత్, ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీకి చేరి, ఫ్యాషన్ రంగంలో ఇంట్రెస్ట్ ఉండటంతో డిగ్రీ మధ్యలోనే ఆపివేసింది. ఇక చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్న సీరత్, 16 ఏళ్లకే డాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. అనంతరం ‘Rockstar’ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేసింది.
