హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వకేట్ కోమల ఆంజనేయులుతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నిన్న బర్కత్ పురాలోని సిటీ బీజేపీ ఆఫీసుకు వచ్చింది. కార్యకర్తలు ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుంది.
►ALSO READ | బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తాం.. స్థానిక ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
దీంతో పాటు గ్రౌండ్ లో బలాబలాలను అంచనా వేసింది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఐదుగురి పేర్లను సూచిస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు నివేదిక అందించింది. కమిటీ సూచించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుష నేతలు ఉన్నారు. వారిలో గతంలో పోటీ చేసి ఓటమి పాలైన లంకల దీపక్ రెడ్డి తో పాటు జూటూరి కీర్తి రెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణ, ఆకుల విజయ ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముఖ్యనేతలతో చర్చించనున్నారు. అనంతరం జాతీయ నాయకత్వానికి పేర్లు పంపుతారు. ఆ తర్వాత క్యాండిడేట్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది.
