- మహిళలపై వడ్డీ వ్యాపారి బూతు పురాణం
- జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు
జూబ్లీహిల్స్ , వెలుగు: అప్పు తిరిగి చెల్లించలేదన్న సాకుతో ఓ వడ్డీ వ్యాపారి మహిళా బాధితుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్లో క్యాటరింగ్ వ్యాపారం చేసే శ్రీనివాస్, రాజ్యలక్ష్మి దంపతులు అత్యవసరంగా ఆవుల భాస్కర్ అనే వ్యక్తి వద్ద రూ.20 లక్షలు వడ్డీకి తీసుకున్నారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ ఈ నెల 11న భాస్కర్ తన తల్లితో కలిసి వారి ఇంటికి వెళ్లి డబ్బుల ఇవ్వాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో రాజ్యలక్ష్మిని దూషిస్తుండగా, ఆమె కూతురు శ్యామల అడ్డుకొని ప్రశ్నించింది.
దీంతో రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారి ‘నీ కూతురు నా కొడుకు కోరిక తీరిస్తే డబ్బులు అడగడం మానేస్తానని, లేదంటే 10 మందిని పంపిస్తా బిజినెస్ చేసుకో’ అంటూ అత్యంత అసభ్యకర పదజాలంతో వేధించాడు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు ఆవుల భాస్కర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

